నీరెత్తిపోసేది ఎప్పుడు..?

బతుకమ్మ మోర్తాడ్: ఒక పక్క వర్షాలు కొన్ని రోజులుగా పడకపోవడంతో వేసిన పంటలకు నీరు అందించే పరిస్థితి లేనందున రైతులు ఇబ్బంది పడుతున్నామని రైతు నాయకులు గురిజాలా నర్సారెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఎత్తిపోతల పథకం కింద 28 చెరువులకు నీరు అందించే అవకాశం ఉంది. ఈ పథకం దిగువన మొత్తం 8,297 ఎకరాల ఆయకట్టు ఉందని రైతులు తెలిపారు. వడ్యాట్ గ్రామానికి వెళ్ళే లైన్ తిమ్మాపూర్ వద్ద డ్యామేజ్ కావడం జరిగిందని, మిగిలిన మూడు యంత్రాల పని తీరు ఎలా ఉందో తెలియాలంటే ముందుగా ఒక సారి ట్రయల్ చేసి చూడటం వలన యంత్రాల మరమత్తులు ఎంత వరకు అవసరం ఉందో అర్థం అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వడ్యాట్ లైన్ మరమ్మత్తులు చేసి నీటి విడుదలకు సహకరించాలని రైతులు కోరారు. కార్యక్రమంలో రైతులు జక్క సంతోష్, బాబ్బురి లింభాద్రి, నర్సయ్య, ఉరడి సాగర్, బబ్బూరి నడిపి లింబన్న తదితరులు పాల్గొన్నారు.

When will the water drain...?
Comments (0)
Add Comment