భిక్కనూర్ లో దళిత సంఘాల రాస్తారోకో

బతుకమ్మ భిక్కనూర్: భిక్కనూర్ మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రి లో గురువారం రాత్రి గ్రామానికి చెందిన స్వామి అనారోగ్యంతో చికిత్స నిమిత్తం వచ్చారు. అయితే అతడు తెల్లవారుజామున మృతి చెందడంతో ఆర్ఎంపి వైద్యుడి వైద్యం వికటించే వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే అతడు మరణించాడు అని ఆరోపిస్తూ హాస్పిటల్ దగ్గర గొడవకు దిగారు. తర్వాత స్థానిక బస్టాండ్ దగ్గర రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ఇద్దరికీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.జ్వరంతో బాధపడిన స్వామి కి ఆయన చికిత్స అందించడం వల్లే మృతి చెందాడని అతని కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

Write Dalit Sanghas in Bhikkanur..
Comments (0)
Add Comment