బతుకమ్మ: బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతీ బూత్‌లో యజ్ఞంలా సభ్యత్వాలు చేయించేలా బీజేపీ శ్రేణులు పని చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రౌత్వార్ కృష్ణ పటేల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గోనే గంగారం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని స్థానిక బిజెపి కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రౌత్వార్ కృష్ణ పటేల్ , ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గోనె గంగారం,ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. ఒక పవిత్ర యజ్ఞంలా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. బీజేపీ ఒక విభిన్నమైన ఆలోచన విధానం, ప్రత్యే కమైన సిద్ధాంతం కలిగిన పార్టీ అన్నారు. ఇందులో పనిచేసే కార్యకర్తలు దేశహితం, ధర్మహితం మాత్రమే చూస్తారని, అలాంటి కార్యకర్తలు కేవలం బీజేపీలోనే కనిపిస్తారన్నారు.
ప్రపంచంలో అత్యంత క్రమశిక్షణ గల పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీలోకి కొత్తవారిని చేర్పించాలని, వారందరికీ సభ్యత్వం కల్పించాలని కోరారు. వర్గంలో 20 వేల సభ్యత్వాలు నమోదు చేయించాలని, అందుకోసం సమయం కేటాయించాలని సూచించారు. త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలు సభ్యత్వ నమోదులో భాగస్వా ములు కావాలాని సూచించారు. సమావేశంలో నాయకులు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గోనె గంగారం, బీజేవైఎం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి విష్ణు, బీజేవైఎం యువ నాయకులు గంగాధర్, బిజెపి మండల అధ్యక్షులు మల్లికార్జున దేశాయ్, బిజెపి జిల్లా బాధ్యులు రామ్ పటేల్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు