ఎన్యూమరేషన్ ఫారం నింపకుంటే మీ ఓటు గల్లంతే: చండూరు తహశీల్దార్ హెచ్చరిక

అక్షరకలం, చండూరు సమగ్ర ఇంటింటి ఓటర్ల సర్వే (ఎస్ ఐ ఆర్ – 2026)లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి బీఎల్ఓలు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేసి తిరిగి ఇవ్వాలని చండూర్ తహశీల్దార్ స్పష్టం చేశారు. గతంలో ఓటు వేసినా, ఓటర్ ఐడీ ఉన్నా సరే.. ఈ ఫారం నింపి ఇవ్వకపోతే కొత్త ఓటర్ల జాబితాలో పేరు నమోదవ్వదని, మీ ఓటు గల్లంతవుతుందని ఆయన హెచ్చరించారు. కాబట్టి చండూరు మండల పరిధిలోని ఓటర్లందరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గ్రామ బీఎల్ఓలను సంప్రదించి, ఫారాలను పూర్తి చేసి అందజేయాలని తహశీల్దార్ కోరారు.

If you don't fill the enumeration formyour vote will be lost: Chandur Tehsildar warning
Comments (0)
Add Comment