అక్షరకలం, చండూరు సమగ్ర ఇంటింటి ఓటర్ల సర్వే (ఎస్ ఐ ఆర్ – 2026)లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి బీఎల్ఓలు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేసి తిరిగి ఇవ్వాలని చండూర్ తహశీల్దార్ స్పష్టం చేశారు. గతంలో ఓటు వేసినా, ఓటర్ ఐడీ ఉన్నా సరే.. ఈ ఫారం నింపి ఇవ్వకపోతే కొత్త ఓటర్ల జాబితాలో పేరు నమోదవ్వదని, మీ ఓటు గల్లంతవుతుందని ఆయన హెచ్చరించారు. కాబట్టి చండూరు మండల పరిధిలోని ఓటర్లందరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గ్రామ బీఎల్ఓలను సంప్రదించి, ఫారాలను పూర్తి చేసి అందజేయాలని తహశీల్దార్ కోరారు.