లక్ష్యం 10 శాతం

—బడిబాట’తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలి

— విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణి

​— కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

— ప్రభుత్వ విద్యా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశం

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం

బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రతి పాఠశాలలో కనీసం 10 శాతం మేర విద్యార్థుల నమోదును పెంచాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణి సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లతో జిల్లాల విద్యాశాఖ పనితీరును సమీక్షించారు. 

బడిబాట కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్తృతంగా నిర్వహించి ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థుల నమోదును పెంచాలని యోగితా రాణి సూచించారు. పాఠశాల విద్యతో పాటు ,ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.ఇంటర్మీడియట్ విద్యార్థులకు అల్పాహార పథకం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు ఈ విద్యా సంవత్సరంలో అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదుపాయాలపై తల్లిదండ్రులు, విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.డిగ్రీ కళాశాలల్లో నైపుణ్యాధారిత విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థుల్లో ఉద్యోగ అవకాశాలను పెంపొందించే విధంగా కోర్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా రెవిన్యూ అధికారి దశరథ్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, ఇంటర్మీడియట్ వైద్యాధికారి అధికారి దస్రునాయక్,మహాత్మా గాంధీ యూనివర్సిటీ అడ్మిన్ డైరెక్టర్ రేఖ పాల్గొన్నారు.

లక్ష్యం 10 శాతం
Comments (0)
Add Comment