ఏడు దశాబ్దాల తెలుగు ప్రజల గుండె చప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్….

 

అక్షరకలం వెబ్ నాగార్జునసాగర్

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేవలం చరిత్ర తో కాకుండా,ఇది భవిష్యత్తుకు ఒకమార్గదర్శకం

1955 డిసెంబర్ 10న పునాది పడిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు 70 ఏళ్లు పూర్తి చేసుకుని గురువారం నాటికి 71వ వసంతంలోకి అడుగుపెడుతోంది,నందికొండ వద్ద కృష్ణమ్మ ఒడిలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.అప్పటి ప్రధాని నెహ్రూ వేసిన పునాది రాయి,నేడు రెండు తెలుగు రాష్ట్రాలకు వెలుగునిచ్చే జలధారగా మారింది,నాడు సాగర్ నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా భావించి పూర్తి చేశారు.ఇది కేవలం ఒక ఆనకట్ట కాదు రెండు రాష్ట్రాల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలంగా నిలబెట్టిన గణాంక విజయం,ఏడు దశాబ్దాల పాటు సాగర్ నెరవేర్చిన లక్ష్యాలు సాగు,తాగు,విద్యుత్ అవసరాలను తీర్చడంలో సాగర్ ప్రాముఖ్యత స్పష్టమవుతుంది,ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు.ఆయకట్టు,కుడి,ఎడమ కాలువల ద్వారా నేరుగా కృష్ణమ్మ జలాలను రాజకీయాలకు అతీతంగా వివాదాలకు తావు లేకుండా సమర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా 22 లక్షల ఎకరాలకు సాగునీరు,అందిస్తుంది,

 *సాగర్ అద్భుత నిర్మాణం*

అది రాళ్లు,సిమెంట్,ఇసుకతో కట్టిన ఆనకట్ట మాత్రమే కాదు,లక్షలాది మంది శ్రమజీవుల కష్టంతో నిర్మించిన అద్భుత నిర్మాణం,కరువు కోరల్లో చిక్కుకున్న తెలుగు నేలకు ఊపిరి పోసిన సంజీవనిగ మన నాగార్జున సాగర్ ప్రాజెక్టును భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక దేవాలయం 

గా అభివర్ణించిన ఈ మహా కట్టడం, అప్పట్లో ఆధునిక యంత్రాలు పెద్దగా లేని ఆ రోజుల్లో సుమారు 50 వేల మందికి పైగా కార్మికులు,ఇంజనీర్లు రేయింబవళ్లు శ్రమించారు.మనుషుల చేతులతో,తట్టలతో మోసి కట్టిన ఈ డ్యామ్ మానవ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం.

అన్నపూర్ణకు ఆధారం కుడి,ఎడమ కాలువల ద్వారా నల్గొండ,సూర్యాపేట, ఖమ్మం,కృష్ణా,గుంటూరు,ప్రకాశం జిల్లాల్లోని బీడు భూములను పచ్చని మాగాణులుగా మార్చి అద్భుత పుణ్య దేవాలయంగా విరాజిల్లుతుంది.

Nagarjuna Sagar projectthe heartbeat of Telugu people for seven decades....
Comments (0)
Add Comment