నల్లగొండ,సెప్టెంబర్,15 (అక్షర కలం ):
చిట్యాల మండలం వానిపాకల గ్రామానికి చెందిన దోమల రాములు తండ్రి యాదయ్య, మూడవ తరగతి చదువుతున్న 8 ఏళ్ల మైనర్ అమ్మాయి ఇంట్లోకి 11-02-2018 న అక్రమంగా ప్రవేశించి సదరు మైనర్ బాలిక టీవి చూస్తుండగా బెదిరించి, లైంగిక దాడి చేయడం జరిగింది.ఈ ఘటనపై బాధితురాలి తండ్రి చిట్యాల పోలీస్ స్టేషన్లో ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితుడి పైన Cr.No:23/2018 SC.No:91/2018 U/s 448,376(2)(i) IPC & Sec.5(m)& r/w 6 of POCSO Act-2012 క్రింద కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టులో ఛార్జ్ సీట్ దాఖలు చేయగా నేడు గౌరవ ADJ-II కమ్ SC/ST కోర్టు & అత్యాచారం మరియు POCSO కేసుల కోర్ట్ నిందితునికి దోషిగా నిర్ధారించి,
1) *Sec.376 IPC& POCSO చట్టం (Sec.5 (1) & 6 of POCSO Act, 2012) ప్రకారం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష + రూ.25,000 జరిమానా**
2) *Sec.448 IPC ప్రకారం1 సంవత్సరం జైలు 5000 రూపాయల జరిమానా*
*మొత్తం కలిపి 21 సంవత్సరాల జైలు 30 వేల రూపాయల జరిమాన*
బాధితురాలికి రూ.10 లక్షల రూపాయల పరిహారంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని తీర్పు వెలువడించిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంగా పోక్సో యాక్ట్ ప్రకారం 18 కేసులలో 19 మంది నిందితులకు గౌరవ న్యాయస్థానం జైలు శిక్ష మరియు జరిమాన విధించడం జరిగిందని ఎవరైనా మైనర్ బాలికలపై ఆత్యాచారాలకు పాల్పడితే ఎప్పటికైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ఈ కేసులో సరి అయిన సాక్ష్యదారలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ పాండురంగ రెడ్డి, యస్.ఐ సైదాబాబు,అలాగే ప్రాసెక్యూషన్ కు సహకరించిన కె.శివరాం రెడ్డి, నల్గొండ DSP, శాలిగౌరారం సిఐ నాగరాజు, నార్కట్ పల్లి,యస్.ఐ రవి కుమార్,పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్,CDO యాదయ్య, లైజన్ అధికారులు,లీగల్ ఆఫీసర్ బరోసా సెంటర్ కె.కల్పన,P.నరేందర్, N.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.