3 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి

. . . శ్రీరాంసాగర్ 41 గేట్ల ఎత్తివేత

. . . ప్రాజెక్టుకు 2 లక్షల 51 క్యూసెక్కుల ఇన్  ఫ్లో

బతుకమ్మ, మెండోరా :  శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తగా అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ఉదయం 8 గేట్లను ఎత్తి ఇన్ ఫ్లో ఆధారంగా ఔట్  ఫ్లోను పెంచిన అధికారులు రాత్రికి వరద పెరుగడంతో గేట్ల సంఖ్యను  పెంచారు. సోమవారం రాత్రి మొత్తం 42 గేట్లకు గాను 41 గేట్లను ఎత్తి 3 లక్షల 14 వేల 928 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు  రాత్రి 2 లక్షల 65 వేల 853 క్యూసెక్కుల ఇన్ ఫ్లో  రాగా ప్రాజెక్టులో 72.990 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో నీటి మట్టం 1091కి గాను 1088.9 మీటర్ల నీరు ఉండడంతో ఏ క్షణమైనా డ్యాం  నిండుతుందని ఔట్  ఫ్లోను  పెంచారు. గోదావరిలోకి నీటి విడుదల పెరుగడంతో ఉదయం నుంచే స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. నది  పరివాహక ప్రాంతంలోకి ఎవరిని వెళ్లవద్దని సూచనలు చేశారు.

3 lakh cusecs of water into Godavari
Comments (0)
Add Comment