. . . శ్రీరాంసాగర్ 41 గేట్ల ఎత్తివేత
. . . ప్రాజెక్టుకు 2 లక్షల 51 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
బతుకమ్మ, మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తగా అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ఉదయం 8 గేట్లను ఎత్తి ఇన్ ఫ్లో ఆధారంగా ఔట్ ఫ్లోను పెంచిన అధికారులు రాత్రికి వరద పెరుగడంతో గేట్ల సంఖ్యను పెంచారు. సోమవారం రాత్రి మొత్తం 42 గేట్లకు గాను 41 గేట్లను ఎత్తి 3 లక్షల 14 వేల 928 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు రాత్రి 2 లక్షల 65 వేల 853 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా ప్రాజెక్టులో 72.990 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో నీటి మట్టం 1091కి గాను 1088.9 మీటర్ల నీరు ఉండడంతో ఏ క్షణమైనా డ్యాం నిండుతుందని ఔట్ ఫ్లోను పెంచారు. గోదావరిలోకి నీటి విడుదల పెరుగడంతో ఉదయం నుంచే స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. నది పరివాహక ప్రాంతంలోకి ఎవరిని వెళ్లవద్దని సూచనలు చేశారు.