గుబులు రేపుతున్న వింత వాతావరణం…

అప్పుడే వాన… వెనువెంటనే ఎండ… అయోమయంలో అన్నదాతలు…

 కొల్చారం, నవంబర్ 04( అక్షర కలం వెబ్ ):-

అల్పపీడనం ప్రభావం, వింత వాతావరణం రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. పంట చేతికి అందుతున్న తరుణంలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను కలవర పెడుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొల్చారం మండలంలో వరి పంటల కోతలు పూర్తి కాక పోవడంతో కేంద్రాల్లో విక్రయించుకునేందుకు పొలాల్లో, రోడ్లపై ఆరబెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడే వర్షం కురుస్తుండడం, వెనువెంటనే ఎండ కాయడంతో అన్నదాతలు అయోమయంలో పడి ఆందోళన చెందుతు న్నారు. అంతేకాకుండా ఒకచోట వర్షం కురిస్తే, మరోచోట ఎండగా ఉండడంతో రైతన్నలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వర్షం కురియగానే కుప్పలు చేసి చేసి పెట్టగా, మరుక్షణం ఎండాకాయడంతో ఏం చేయాలో రైతులు తికమక పడుతున్నారు.

చేతికొచ్చిన పంట నోటికందే సమయంలో వరుణుడు తమపై ప్రతాపం చూపుతున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

A strange atmosphere is stirring...
Comments (0)
Add Comment