కొల్చారం, నవంబర్ 08( అక్షర కలం వెబ్ ):-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం ఉదయం షాపుల్లో , హోటల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఎంపీ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షేట్కర్, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మొహి నుద్దీన్ కలిసి మధ్యాహ్నం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చేతి గుర్తుకు ఓటు వేయాలని శనివారం ఉదయం నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మంచి స్పందన వచ్చిందని, తప్పకుండా చేయి గుర్తుకు ఓటు వేస్తామని అన్నారని తెలిపారు. ప్రచారంలో ఎంపీ సురేష్ సెట్కర్ మాజీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మొహియుద్దిన్ లు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో బి ఆర్ఎస్ , బిజెపి పార్టీలు ప్రజలకు ఓర్గబెట్టిందేమీ లేదని వారు తెలిపారు. గత పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వారు గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ప్రజలు పట్టం కడతారని వారు తెలిపారు. ఈ ప్రచారంలో ఎంపీ తో పాటు మాజీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మొ యినుద్దీన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ల సంతోషంతో తప్పకుండా నవ్వి యాదవ్ అన్న గెలుస్తాడని నమ్మకంతో విజయోత్సవం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఎంపీ సురేష్ షే ట్కర్ మాజీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మొయి నుద్దిన్, అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు పాల్గొన్నారు.