చిన్న ఘనపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో.. ఘనంగా బతుకమ్మ సంబరాలు…

– ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాధికారి సత్యనారాయణ రావు…

కొల్చారం సెప్టెంబర్ 20 ( అక్షర క లం, వెబ్ ):-

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ ఉన్నత పాఠశాలలో శనివారం మండల విద్యాధికారి సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణరావు పి టి ఏం సమావేశంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిరోజు వాడికి హాజరయ్యే విధంగా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ దసరా సెలవుల్లో విద్యార్థులు చెరువుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించారని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.

దసరా సెలవుల్లో ఇంటివద్ద పిల్లల్ని కచ్చితంగా రోజు ఒక గంట పాటు చదివించాలని కొల్చారం మండల విద్యాధికారి సత్యనారాయణరావు తెలిపారు. అదేవిధంగా పాఠశాలల్లోని విద్యార్థులు యొక్క ప్రతి ప్రదర్శన తల్లిదండ్రుల ముందు ప్రదర్శించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణరావు, సరిత , ప్రియాంక, జ్యోతి, వీరేశం, బ్రహ్మచారి , రమేష్, పాఠశాల విద్యార్థులు , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Batukamma celebrations at a small Ghanpur primary high school ...
Comments (0)
Add Comment