జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

– గతంలో కంటే భిన్నంగా ఈ సీజన్లో సుమారు 1,00000 మెట్రిక్ టన్నుల అదనంగా ధాన్యం కొనుగోలు కలెక్టర్….

– 4,18,244.360 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటివరకుకొనుగోలు…..

– 892.62 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేగంగా చెల్లింపు…..

– ఈ సంవత్సరం రబీ సీజన్లో సంవత్సరంలో 86,130 మంది రైతులకు ప్రయోజనం…..

– 528 కేంద్రాల్లో కొనుగోలు పూర్తిచేసుకుని ముగించడం జరిగింది….. 

– ముగింపు దశలో కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు….

– గతం కంటే వేగంగా రైతులకు చెల్లింపులు…. 

– మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్….

 మెదక్ /కొల్చారం జూన్ 20(అక్షర కలం):- 

రబి సీజన్ కు ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో కొనుగోలు జరుగుతుందని గత సీజన్ లో ఈ రోజుతో పోలిస్తే ఈ రబీ సీజన్లో ఈ రోజు వరకు 01 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసి అతివేగంగా రైతుల ఎకౌంట్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ

జిల్లాలో యాసంగి సీజన్ వడ్ల సేకరణ కోసం మొత్తం 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, గతంలో కంటే కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించి జిల్లాలో రైతులకు వేగంగా చెల్లింపులు జరిగాయనీ, తెలిపారు.జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు ముగింపు దశలో ఉన్నాయని జిల్లాలో అన్నీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు తరలించటం జరుగుతుందని అన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత రబీ 2024-25సీజన్లో 3,20,000 మెట్రక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు వేగంగా చెల్లింపులు జరిగాయని తెలిపారు.2026 -2027 సంవత్సరం రబీ సీజన్లో 20-6-2026 వ తేదీ నాటికి జిల్లాలో 4,18,244.360 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 892.62 కోట్ల రూపాయలు 86,130 రైతులకు మంది రైతులకు లబ్ధి చేకూరింది అన్నారు. గత సీజన్ తో పోలిస్తే ఈ రబీ సీజన్లో(01) లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశామని తెలిపారు.ధాన్యం కొనుగోలు ముగింపు దశలో ఉన్నాయని రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కలెక్టర్ స్పష్టం చేశారు.

Record purchase of grain in the district
Comments (0)
Add Comment