బతుకమ్మ , నిజామాబాద్ సిటీ ;
నిజామాబాద్ నగరంలోని 7వ డివిజన్ శాంతి భవన్ లో బ్రహ్మకుమారీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షా బంధన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కు బ్రహ్మకుమారీలు రాఖి కట్టి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు.. సోదరాభావానికి ప్రతీకగా భారతదేశం అంత జరుపుకునే రాఖి పండుగ అనాదిగా వస్తుందని భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉందని అన్నారు . భారతీయులంతా నా సోదరిమనులంటు, పరాయి స్త్రీ ని కూడా అక్కగా, చెల్లిగా చూసే గొప్ప సంస్కృతి మన దేశంలోనే ఉందని అలాంటి సంస్కృతిని, సోదరాభావన్నీ పెంపొందించే పండుగే రాఖి అని గుర్తు చేశారు.ఈ రాఖి అనేది అన్న -చెల్లికి, అక్క – తమ్మునికి రక్షాగా ఉంటు మనమంతా ఈ దేశానికి భరతమాతకు రక్షా ఉండాలని సూచించారు చిన్నప్పటి నుండే పిల్లలో సోదరాభావన్నీ, దేశ భక్తిని నింపే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓం శాంతి భవన్ సభ్యులు .వనజ, సుజాత , బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మి నారాయణ,7వ డివిజన్ కార్పొరేటర్ సుక్క మధు,బీజేపీ నాయకులు ఇప్పకాయల కిషోర్,మఠం పవన్,కిరణ్,దీపక్, బాబీ సింగ్, శేఖర్,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.