దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ ను బహిష్కరించండి

రాహుల్ గాంది దిష్టి బోమ్మను దహనం చేసిన బిజేవైయం

బతుకమ్మ నిజామాబాద్ సిటీ..

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారతదేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను వెంటనే భారతదేశము నుండి బహిష్కరించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పొనుగంటి సతీష్ మండిపడ్డారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేవైఎం ఆధ్వర్యంలో నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ భారతదేశాన్ని భారతదేశంలో ఉండే ప్రజలను కించపరిచే విధంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే రాహుల్ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆయనకు మనదేశంలో ఉండే నైతిక హక్కు లేదని విమర్శించారు.గతంలో కూడా మన దేశంలో జరిగిన పలు సమావేశాలలో సందర్భాలలో దేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఆయనకు భారతదేశం పైన దేశ ప్రజల పైన గాని ఇలాంటి గౌరవం లేదని, చట్ట ప్రకారం భారతదేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాహుల్ పై వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తీక్, నరేష్, కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, చిరు, మైనార్టీ అధ్యక్షులు కైసర్ తదితరులు పాల్గొన్నారు.

Expel Rahul for making derogatory remarks about the country
Comments (0)
Add Comment