* తుక్కుగూడ జిహెచ్ఎంసి కమిషనర్ ను కలిసి వినతి పత్రం, అందజేసిన సర్దార్ పటేల్ యువజన సంఘం.
* అధ్యక్షులు పులియోజు వెంకటాచారి
* ప్రధాన కార్యదర్శి పాల్వాయి నవీన్ కుమార్
మహేశ్వరం డిసెంబర్ 17, (అక్షర కలం వెబ్ )
రావిరాల గ్రామ పేరుతో ప్రత్యేక డివిజన్ గా ప్రకటించాలని సర్దార్ పటేల్ యువజన సంఘం అధ్యక్షులు పులియోజు వెంకటాచారి,ప్రధాన కార్యదర్శి పాల్వాయి నవీన్ కుమార్ తుక్కుగూడ జిహెచ్ఎంసి కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రేటర్ హైదరాబాదులోని 300 ల వార్డులలో రావిరాలలో గల ఐదు వార్డులను రెండు ముక్కలుగా చీల్చి ఒక ముక్కను 66వ వార్డు తుక్కుగూడలో రెండో ముక్కను 67వ వార్డు ఇమామ్ గూడలో కలపడం జరిగిందని ఇలా చేయడం సరైన విధానం కాదని అతి పెద్ద రెవిన్యూ, ఓటు బ్యాంకు కలిగిన రావిరాల గ్రామంలోని ఐదు వార్డులతో రావిరాల గ్రామ పేరుతో ప్రత్యేక వార్డును ప్రకటించాలని సర్దార్ పటేల్ యువజన సంఘం రావిరాల తరఫున ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించారు. వెంటనే రావిరాల గ్రామాన్ని
ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పులియోజు వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి పాల్వాయి నవీన్ కుమార్, కోశాధికారి లింగం వికాస్ ముదిరాజ్,వ్యాయామ కార్యదర్శి గున్నాల మల్లేష్ యాదవ్, మాజీ అధ్యక్షులు పోలెమోని సీయోధన్ ముదిరాజ్,మాజీ ఉపాధ్యక్షులు గుణాల వీరేష్ యాదవ్ పాల్గొన్నారు.