మహేశ్వరం సర్పంచ్ గా మునగపాటి నవీన్ భారీ విజయం 

*మహేశ్వరం గడ్డ బిఆర్ఎస్ అడ్డ అని నిరూపించిన బిఆర్ఎస్ నాయకులు

*మహేశ్వరంలో ఎగిరిన బిఆర్ఎస్ జెండా 

*మునగపాటి నవీన్ గెలుపుతో

*మహేశ్వరంలో బిఆర్ఎస్ నాయకుల సంబరాలు

మహేశ్వరం, డిసెంబర్ 18, (అక్షర కలం)

మహేశ్వరం గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మునగపాటి నవీన్ భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలిచారు. మహేశ్వరంలో సర్పంచ్ అభ్యర్థులుగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాకి ఈశ్వర్, బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి పోతర్ల సుదర్శన్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీని బలపరిచిన అభ్యర్థి మునగపాటి నవీన్ ముగ్గురు పోటీపడ్డారు. ఉత్కంఠ బరితంగా జరిగిన పోరులో చివరకు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మునగపాటి నవీన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. బిజెపి అభ్యర్థి సుదర్శన్ యాదవ్ పై 1187 కోట్లతో నవీన్ పొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకి ఈశ్వర్ మూడో స్థానానికి చేరుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తూ ఎవరికి అంతు చిక్కని విధంగా ప్రశాంతంగా నిదానంగా తమ పని తాము చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకుంటూ గ్రామంలో అన్ని కుల సంఘాలను కలిసి బీఆర్ఎస్ కు ఓటు పడే విధంగా అన్ని రకాలుగా ప్రయత్నం చేసి విజయం సాధించారు. అందుకే బిఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీనికి ముఖ్యంగా సీనియర్ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఇతర పార్టీలకు అంచనాలను తారుమారు చేస్తూ తమ వ్యూహాన్ని రచించి గెలుపు దశగా ప్రయత్నం చేసి విజయం సాధించారు. మహేశ్వరం గడ్డ బిఆర్ఎస్ అడ్డా అని మరోసారి నిరూపించుకున్నారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి చెందిన వార్డు సభ్యులు 09 మంది వార్డు సభ్యులు గెలుపొందగా, బిజెపి 3 ముగ్గురు వార్డు సభ్యులు గెలుపొందగా,2 ఇద్దరు కాంగ్రెస్ వార్డు సభ్యులు గెలుపొందారు. బిఆర్ఎస్ విజయం సాధించడంతో మహేశ్వరంలో టిఆర్ఎస్ నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి మహేశ్వరంలో టిఆర్ఎస్ ఘన విజయం సాధించడం పట్ల నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

Munagapati Naveen is a huge success as Maheshwaram Sarpanch
Comments (0)
Add Comment