సిద్దిపేట్ పోలీస్ కమీషనర్ విజయ్ కుమార్
అక్షర కలం , సిద్ధిపేట జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 18
ఈ నెల 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమీషనర్ విజయ్ కుమార్ గురువారం తెలిపారు. చిన్న చిన్న కంపౌండబల్ కేసులలో కోర్ట్ చుట్టూ తిరుగుతున్న ప్రజలకి ఇదొక మంచి అవకాశమని అన్నారు. రాజీ పడ దగిన కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు టౌన్ న్యూసెన్స్ కేసులు, చెక్ బౌన్స్ కేసులో మరియు ఇతర రాజీ పడ దగిన కేసులలోని నిందితులు , ఫిర్యాదీదారులు సంబంధిత పోలీస్ స్టేషన్ ని లేదా న్యాయస్థానాన్ని నేరుగా సంప్రదించి రాజి పడవచ్చునని తెలిపారు.చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని , డబ్బులను వృధా చేసుకోవద్దన్నారు. పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్లో రాజీ పడ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పిస్తున్నారనీ అన్నారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని తెలియజేశారు.