మత్స్యకారుల అభివృద్ధి కోసమే చేప పిల్లల పంపిణీ ఎమ్మెల్యే వేముల వీరేశం 

* మూసి ప్రాజెక్టులో 19 లక్షల చేప పిల్లల విడుదల 

నకిరేకల్ నియోజకవర్గం : అక్షర కలం , 

మత్స్యకారుల సంక్షేమం కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసామని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ లో మంగళవారం నాడు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మూసి ప్రాజెక్టులో  ఉచిత చేప పిల్లల ను నకిరేకల్ లోని మూసి ప్రాజెక్టులో వదిలారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం మూసీ లో చేప పిల్లలు వదిలామని అన్నారు. మూసి ప్రాజెక్టులో  చేప పిల్లలను వదలటం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న చెరువులకు కోటి ఐదు లక్షల చేప పిల్లలు పంపిణీ  చేశామని, 30 వేల ఎకరాలకు సాగు నీటినీ అందించే మూసి ప్రాజెక్టు నకిరేకల్ కు తలమానికం అని అన్నారు. అంతేకాకుండా మూసీ గెస్ట్ హౌస్ ను పునరుద్దిస్తామని మూసీ ప్రత్యేకంగా పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా సహకారం కోసం బోటింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు మూసీలో వ్యర్ధాలు వదిలిన వారిపై ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ ఏడి రాజారాం, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, సహకారక సంఘ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, నాయకులు మత్స్యశాఖ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు..

MLA Vemula Veeresham distributed fish fry for the development of fishermen
Comments (0)
Add Comment