అక్షర కలం/ ప్రతినిధి :
ఆగస్టు 8 న పండుగ సాయన్న జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు మాట్లాడుతూ పండుగ సాయన్న జయంతి మరియు వర్ధంతిలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చేయాలని గౌరవం శాసనసభ్యురాలు పర్ణిక రెడ్డి గారికి, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడాల, మాత్స్య శాఖ మరియు యువజన సర్వీసుల మంత్రివర్యులు ముదిరాజ్ ముద్దుబిడ్డ డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి త్వరలో కలిసి వినతి పత్రం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో త్వరలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటుకు తగిన స్థలాన్ని పరిశీలించి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ముదిరాజ్ సంఘం చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఇదే కార్యక్రమంలో ముదిరాజ్ పట్టణ అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య గారు మాట్లాడుతూముదిరాజు ల కు పండుగ సాయన్న జీవితం ఆదర్శప్రాయంగా ఉందని పండుగ సాయన్న ఆశయాలను అందరూ యువకులు, ముదిరాజులు,బీసీలు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా మాత్స్య సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్ గారు మాట్లాడుతూ 1860 నుంచి 1890 మధ్యకాలంలో తన పోరాటాలను పెత్తందారులపై, భూస్వాములపై,పట్వారి లపై కొట్లాడి పెద్దోన్ని కొట్టు పేదోలకు పంచు అనే నిదానంతో జీవించిన పండుగ సాయన్న జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలని త్వరలో పండుగ సాయన్న విగ్రహాన్ని నారాయణపేట జిల్లా లో ఏర్పాటుకు నాగరాజు అన్న గారి నేతృత్వంలో కచ్చితంగా కమిటీ ఏర్పాటు చేసుకొని విగ్రహ ఏర్పాటుకు చేసే విధంగా చేస్తామని ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పట్టణ భాజపా అధ్యక్షులు పోశల్ వినోద్ గారు జిల్లా ఆర్టిఏ మేంబర్ పోషల్ రాజేష్ గారు,పళ్ళ వెంకట్రాములు
మ్యాకల హన్మంతు,డాక్టర్ కాకర్ల భీమయ్య,గోవిందుగేరి గోపాల్,ఆకుల వెంకటేష్,ల్యాబ్ నర్సింహా,సంజీవ్ ప్రకాష్,గుడుగు లక్షుమన్,రామకృష భైరంకొండ,దుబాయ్ వెంకట్రాములు,హన్మంతు పళ్ళ
నవీన్ కుమార్,సాయిలు,మన్నే రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు