*డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన దొంత నిశ్రిత*
*తొలి ప్రయత్నం లోనే విజయతీరాలకు*
మెదక్, సెప్టెంబర్ 25( అక్షర కలం వెబ్ ):-
ఏదైనా సాధించాలనే తపన పట్టుదలతో పాటు తగిన విధంగా శ్రమిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని మెదక్ కు చెందిన దొంత నిశ్రిత నిరూపించింది. టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది. సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ తీసుకున్న ఆమె టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రాసి 502.5 మార్కులతో డీఎస్పీ ఉద్యోగం సాధించింది. డీఎస్పీ ఉద్యోగం సాధించడంపై నిశ్రితకు కుటుంబ సభ్యులు, బంధువులు, పట్టణవాసులు శుభాకాంక్షలు తెలిపారు.
నిశ్రిత కుటుంబ నేపథ్యం..
మెదక్ పట్టణానికి చెందిన దొంత నరేందర్ శిరీష దంపతులకు ఏకైక కుమార్తె నిశ్రిత తండ్రి నరేందర్ నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తుండగా.. తల్లి శిరీష గృహిణి.
విద్యభ్యాసం..
నిశ్రిత ఆరో తరగతి వరకు హైదరాబాదులోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్, పదో తరగతి వరకు మెదక్ గీతా హై స్కూల్ లో, హైదరాబాద్ లోని నారాయణ ఐఎఎస్ అకాడమీలో ఇంటర్, ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ తీసుకున్న ఆమె తొలి ప్రయత్నం లోనే విజయతీరాలకు చేరింది .
పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలి: నిశ్రిత…
ఎవరైనా అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే పట్టుదలతో చదవాలి. నేను గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సివిల్ నా లక్ష్యంగా ముందుకు సాగాను. కానీ డీఎస్పీగా ఉద్యోగం సాధించాను. బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా.. అవకాశమిస్తే సివిల్స్ సాధిస్తా.