నల్లగొండ,ఆగస్టు,29 (అక్షర కలం) ప్రతినిధి :
శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ నల్గొండ జిల్లాలో బత్తాయి సాగు, మార్కెటింగ్ ,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, తదితర అంశాలపై అధ్యయనం నిమిత్తం నల్గొండ జిల్లాలో పర్యటించింది. కమిషన్ సభ్యులు ముందుగా నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి, నిడమనూరు,లలో పర్యటించిన అనంతరం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద ఉన్న బత్తాయి మార్కెట్ ను సందర్శించింది.
ఈ సందర్భంగా బత్తాయి రైతులు, తదితరులతో కమిషన్ సమావేశమైంది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నల్గొండ ఎస్ఎల్ బిసీలోని బత్తాయి మార్కెట్ నిర్వహణ సరిగా లేదని, దీనిని పటిష్టం చేస్తామని తెలిపారు. స్థానిక మార్కెట్లో దళారుల జోక్యం ఎక్కువగా ఉండడం, రైతుల కన్నా ఇతరులే ఎక్కువగా బత్తాయిని అమ్మడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుండి కొనుగోలుదారులు నల్గొండ కు వచ్చి బత్తాయిని కొనుగోలు చేసే విధంగా చూస్తామని, అలాగే మధ్య దళారీ వ్యవస్థను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ నల్గొండలో బత్తాయి మార్కెట్ నిర్వహణ సరిగా లేదని, బత్తాయి మార్కెట్ ను ఎవరూ పట్టించుకోవడంలేదని, దళారులు లేకుండా రైతులే నేరుగా బట్టయిని అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని, మార్కెట్లో ఉన్న కాంటాలు సరిగా పనిచేయడం లేదని, పూర్తిగా నిర్వహణ లోపం ఉందని, 2018లో బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు మార్కెట్ సరిగా పనిచేయడం లేదని, బత్తాయిలు ప్రైవేట్ స్థలంలో కాకుండా మార్కెట్ లొనే అమ్మేలా చూడాలని, అప్పుడే రైతులకు గిట్టుబాటు అవుతుందని చెప్పారు.
కమిషన్ బృందం వెంట
కమిషన్ సభ్యులు, M.సునీల్ కుమార్ గారు, మరికంటి భవాని , చెవిటి వెంకన్న యాదవ్ , మెంబర్ సెక్రటరీ గోపాల్ , OSD హరి వెంకట ప్రసాద్ , ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు ,నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి ,మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, మార్కెటింగ్ సెక్రటరీ శ్రీనాదరాజు, జిల్లా ఉద్యాన శాఖ ఉప సంచాలకులు సుభాషిని, హర్టికల్చర్ అధికారి అనంతరెడ్డి, తదితరులు ఉన్నారు.