నల్లగొండ : అక్షర కలం ఆగస్టు. 09
నల్లగొండ రామగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1982 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం “60 వసంతాల పండుగ” పేరుతో ఆదివారం స్థానిక లక్ష్మి గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. 42 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసిన పూర్వ విద్యార్థులు బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. , పూర్వ ఆంగ్లఉపాధ్యాయు లు రాధాకృష్ణా ను శాలువా, జ్ఞాపికలతో సత్కరించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులను ఆయన ఆశీర్వదించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పాత పాటలు, ఫోటోల ప్రదర్శనతో వాతావరణం ఉత్సాహంగా మారింది. బ్యాచ్ సభ్యులు తమ అనుభవాలను పంచుకుని, స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నలమాద గోపాలకృష్ణ, టీయూడబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి , సైబర్ క్రైమ్ డి.ఎస్.పి లక్ష్మీనారాయణ, విద్యాసంస్థల చైర్మన్ బీరవోలు గోపాల్ రెడ్డి , బిల్డర్ సివిల్ కాంట్రాక్టర్ సామ శ్రీనివాసరెడ్డి , బండ నిరంజన్ రెడ్డి, పసునూరి ప్రవీణ్ రెడ్డి, సమీర్ కుమార్, లక్ష్మయ్య, కె రవీందర్రావు , పారిశ్రామికవేత్త మందడి వెంకట్ రెడ్డి, శశిభూషణ్ శ్రీనివాసరావు, శశి బుషరావు, ఆందోల్ రవికుమార్, సోమా కరుణాకర్, వై నరసింహారావు, బషీరుద్దీన్, వాడపల్లిి సాయిబాబా, జేరిపోతుల లింగయ్య పాల్గొన్నారు