జైలు జీవితం నుండి బయటికి వచ్చిన తర్వాత సమాజానికి మంచి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఖైదీలకు సూచించారు.

గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిథిగా    జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,.,

నల్లగొండ అక్టోబర్ 02 (అక్షర కలం వెబ్ ):

దేశానికి స్వాతంత్య్రం సంపాదించే క్రమంలో మహాత్మా గాంధీ అనేకసార్లు జైలుకు వెళ్లారని, సత్రాగ్రహం ద్వారా స్వాతంత్య్రం సాధించిన గాంధీజీ కృషిని పదిమందికి చాటి చెప్పాలని తెలిపారు.ఖైదీలు జైలు జీవితాన్ని అనుభవంగా, ప్రేరణగా తీసుకొని సమాజంలో అడుగుపెట్టిన తర్వాత పదిమందికి సహాయం చేసే విధంగా మెలగాలని పిలుపునిచ్చారు.

జైలులో సమయాన్ని వృధా చేయకుండా లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదవాలని, చదువు ద్వారానే ఆలోచన పెరుగుతుందని, అది మంచికి ఉపయోగపడేలా మలుచుకోవాలని చెప్పారు.ఏది నేర్చుకోవాలన్న కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలని, ప్రతి మనిషికి ఒకసారి అవకాశం వస్తుందని, చిన్నప్పుడు కష్టపడితే పెద్దయిన తర్వాత సుఖపడుతారని, వయసు పెరిగే కొద్దీ బాధ్యత పెరుగుతుందని, కుటుంబ సభ్యులు మనమీద ఆధారపడే పరిస్థితి ఉంటుందని అన్నారు.
అడిషనల్ ఎస్పీ రమేష్ ,ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, జిల్లా జైలర్ ప్రమోద్, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.

గాంధీ జయంతి ని పురస్కరించుకుని అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు రామగిరి వద్ద ఉన్న గాంధీజి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి హాజరయ్యారు.

The district collector advised the inmates to do good to the community after coming out of prison.
Comments (0)
Add Comment