నల్లగొండ, అక్టోబర్ 14 (అక్షర కలం వెబ్ ):
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు తెలిపారు.బెస్ట్ అవైలబుల్ పాఠశాలల సమస్యల పరిష్కారంపై ఇటీవల జిల్లా లోని పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖల మంత్రి ఆడ్లూరు లక్ష్మణ్ కుమార్ తో కలిసి హైద్రాబాద్ నుండి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమంపై జిల్లా కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిష్టాత్మంగా తీసుకుందని అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద నిధులకు సంబంధించిన ఒప్పందం పాఠశాల యాజమాన్యాలు, జిల్లా యంత్రాంగం మధ్యన జరిగింది,ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే పాఠశాల యాజమాన్యాలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలి తప్ప విద్యార్థులను బయటికి పంపడానికి వీలులేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, సంక్షేమ శాఖల అధికారులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యా హక్కు చట్టం, బెస్ట్ అవైలబుల్ స్కీం ఏం చెబుతుంది, పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య జరిగిన ఒప్పందం లో ఏ ఏ అంశాలు ఉన్నాయో పాఠశాలల యాజమాన్యాలను పిలిచి వివరించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద పాఠశాలల వారీగా ఉన్న బకాయిల వివరాలను వెంటనే పంపాలని కలెక్టర్లకు సూచించారు. బకాయిల్లో కొంత మొత్తాన్ని వెంటనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యా, వైద్య రంగాలపై జిల్లా కలెక్టర్లు సీరియస్ గా దృష్టి సారించాలని పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే ఆర్థిక శాఖ దృష్టికి తీసుకురావాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లకు సూచించారు.
స్థానిక సంస్థల ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్ ,మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.