సంచలం సృష్టించిన గిరిజన మహిళ హత్య…

– కేసును చేదించిన పోలీసులు… వెలుగులోకి సంచలన నిజాలు…

కొల్చారం, అక్టోబర్ 14 ( అక్షర కలం వెబ్ ):-

మెదక్ జిల్లా లోని కొల్చారం మండలం ఏడుపాయలకు వెళ్లేదారిలో సంచలం సృష్టించిన గిరిజన మహిళ హత్య కేసుపై జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ మండలం చిట్యాల జాన్కంపల్లి సంగాయిగూడ తాండకు చెందిన గిరిజన మహిళ కమలను గుర్తు తెలియని దుండగులు ఈనెల 11వ తేదీన ఏడుపాయల వెళ్లి దారిలో గాలి అనిల్ కుమార్ వెంచర్ వెనకాల ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి వివస్త్రను చేసి చీరతో చెట్టు కట్టేసి వెళ్లిపోయారు. 11వ తేదీన 100 నంబర్ కాల్ వచ్చిందని సమాచారంతో మహిళను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. ఈ కేసులో ఇద్దరు డీఎస్పీ లు, ముగ్గురు సీఐలు, 7 ఎస్ ఐ లు, సీసీ ఎస్ బృందం, ఐడి పార్టీలు రంగంలో దిగి సీసీ కెమెరాల నిఘా ద్వారా పాత నేరస్తునిగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. నిందితుడు వట్పల్లి మండలం అంబాజిగూడకు చెందిన ఫకీర్ గా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామన్నారు. ఇతడు గతంలో కూడా ఒక మహిళను హత్య చేశాడని, మరో రెండు కేసులు కూడా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ తోపాటు అడిషనల్ ఎస్పీ మహీందర్. డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఐ జార్జ్, ఎస్ ఐ లు అహ్మద్ మొయినుద్దీన్, శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


 

The murder of a tribal woman who created a sensation ...
Comments (0)
Add Comment