అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో క్రీడల పోటీలు

ప్రారంభించిన ; ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి…

నువ్వా నేను అన్నట్టుగా సాగుతున్న కబడ్డి క్రీడలు 

తుంగతుర్తి మార్చి 22 (అక్షర కలం)

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఆదివారం నాడు అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రావు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మూడు జిల్లాల స్థాయి కబడ్డీ క్రీడలు నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభిస్తానికి ముఖ్యఅతిథిగా గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, స్నేహ సంబంధాలు బలపడతాయని అన్నారు, యువకుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలిగి తీయడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని భుజాన పెట్టుకొని నిర్వహిస్తున్నఅరుంధతి యూత్ సభ్యులను ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అభినందించారు. అనంతరం పలు గ్రామాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. కబడ్డీమొదటగా పనిగిరి ,మోతే ఇరుజట్లు తలపడ్డాయి. నువ్వా నేను అన్నట్టుగా ఉత్కంఠ గా సాగగా గ్రామ ప్రజలు ఎవరు గెలుస్తారు ఊహించని విధంగా ఈ ఇరుజట్లు అంతా ఉత్కట్టంగా తలపడ్డాయి.

చివరిగా మోతే కబడ్డీ టీం పై పనిగిరి జట్టు విజయం సాధించింది. అనంతరం అరుంధతి యూత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సింగిల్ డాన్స్, గ్రూప్ డాన్స్, నాటికలు వివిధ గ్రామాల నుంచి వచ్చి తమ ప్రతిభను కనబరిచారు. దీనిని తిలకిస్తానికి గ్రామాల్లోని మహిళలు,యువకులు, గ్రామస్తులు మరియు వివిధ గ్రామాల క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు , పి ఈ టి లు, అరుంధతి యూత్ యువజన సంఘం సభ్యులు,వివిధ గ్రామాల క్రీడాకారులు, పాల్గొన్నారు.



 

 







 

Three district level Kabaddi games organized by Arundhati Yuvajan Sangam were started; village public representativesvillage elders
Comments (0)
Add Comment