Thursday, October 29, 2026
spot_img
HomeCrimeఅక్రమాలపై అధికారుల విచారణ

అక్రమాలపై అధికారుల విచారణ

📰 Generate e-Paper Clip

–రికార్డుల జిరాక్స్ ప్రతులను తీసుకెళ్లిన అధికారులు

–సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అక్రమాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ముగ్గురు వార్డు మెంబర్లు

— పశువుల సంత కాంట్రాక్టర్ కట్టిన కోటి రూపాయలను సర్పంచ్ వాడుకున్నట్లు ఫిర్యాదు

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం

కొండమల్లేపల్లి పశువుల సంత కాంట్రాక్టర్ కట్టిన వేలం డబ్బులలో సర్పంచ్ కోటి రూపాయలు వాడుకున్నట్లు గ్రామ పంచాయతీకి చెందిన ముగ్గురు వార్డు మెంబర్లు కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు పై మంగళవారం జిల్లా ఆడిట్ అధికారి తో పాటు మరో ఇద్దరు అధికారులు కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన ముగ్గురు వార్డు మెంబర్ లతోపాటు సర్పంచ్ యుగేందర్ రెడ్డి, ఈవో డాకు నాయక్ లను అధికారులు వచ్చిన ఫిర్యాదులపై విచారించారు. సంత కాంట్రాక్టర్ గ్రామపంచాయతీకి చెల్లించిన డబ్బుల వివరాలకు సంబంధించిన రికార్డుల జిరాక్స్ కాపీలను తమతో పాటు తీసుకెళ్లారు. పశువుల సంతను 2026 -2027 సంవత్సరానికి గాను భాస్కర్ రెడ్డి అనే గుత్తేదారు రూ. 3.80 కోట్లకు దక్కించుకున్నాడు. జనవరిలోగా పూర్తి డబ్బులను కట్టాల్సి ఉండగా ఇప్పటివరకు కాంట్రాక్టర్ కేవలం రూ. 1.36 కోట్ల పైచిలుకు డబ్బులు మాత్రమే కట్టాడు. వాస్తవంగా ఇప్పటివరకు కాంట్రాక్టర్ రూ. 3.20 కోట్లు కట్టాల్సి ఉంది. కాంట్రాక్టర్ కట్టవలసిన డబ్బులను గ్రామపంచాయతీ అకౌంటు లో వేయకుండా సర్పంచ్, ఈవో లు కుమ్మక్కై దాదాపు కోటి రూపాయల డబ్బులను వాడుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పశువుల సంతను దక్కించుకున్న కాంట్రాక్టర్ వన్ బై ఫోర్త్ అమౌంట్ కింద కట్టిన రూ. 95 లక్షల ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జనరల్ అకౌంట్లో వేయకుండా టి ఎస్ బి పాస్ అకౌంట్లో జమ చేసి దుర్వినియోగం చేశారని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు విచారణ చేపట్టారు. సిబ్బంది వేతనాల కోసం టి ఎస్ బి పాస్ అకౌంటు లోని 50శాతం డబ్బులను వాడుకోవచ్చని అప్పటి అదనపు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను ఆధారంగా చేసుకుని 50 శాతానికి పైగా డబ్బులను అకౌంటు నుండి డ్రా చేసి విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని వార్డు సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వార్డు మెంబర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పశువుల సంత టెండర్లకు సంబంధించిన రికార్డు అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు విచారణ చేపడుతున్న విషయం తెలుసుకున్న విలేకరులు కార్యాలయానికి వెళ్ళగా అధికారులు విలేకరులను లోపలికి అనుమతించలేదు. తాము విచారణ నివేదికను కలెక్టర్ కు అందజేస్తామని చెప్పారు. కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ పై వస్తున్న వరుస ఫిర్యాదులపై ఎట్టకేలకు అధికారులు విచారణ చేపట్టడాన్ని పట్టణ ప్రజలు స్వాగతిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install AKSHARA KALAM App

Add to home screen for faster loading and latest updates.