Thursday, October 29, 2026
spot_img
HomeCrimeఎల్ నినో సాకుతో దోపిడీ చేస్తే కటకటాలే !

ఎల్ నినో సాకుతో దోపిడీ చేస్తే కటకటాలే !

📰 Generate e-Paper Clip

— ధరలు పెంచితే కఠిన చర్యలు 

–జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ 

–ధరలపై సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 9281423653 కు తెలియజేయండి

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం

ఎల్ నినో దృష్ట్యా నిత్యవసర సరుకుల ధరనులను నియంత్రణలో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం, నిత్యావసర సరుకుల అమ్మకం దారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ఎల్ నినో ను సాకుగా తీసుకొని ఎవరైనా నిత్యావసర వస్తువుల ధరలను పెంచినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. అంతేకాక “నో స్టాక్” బోర్డులు పెట్టడం, ఉన్న ధరలను పెంచి అమ్మడం, సిండికేట్ గా ఏర్పడి నిత్యవసర సరుకుల ధరలను పెంచినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ధరల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ” సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచేందుకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లాలోని కిరాణా, ఆయిల్, పెట్రోల్, డీజిల్, బియ్యం, పప్పు దినుసులు, తదితర నిత్యవసర వస్తువులను అమ్మే హోల్ సేల్, రిటైల్ వ్యాపారస్తులు చట్టానికి వ్యతిరేకంగా నిత్యవసర వస్తువుల ధరలను పెంచవద్దన్నారు. ప్రతి ఒక్కరు చట్టబద్ధంగా వ్యవహరించాలని, సామాన్యుడి ధరను, ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకవేళ అలా కాకుండా ధరలను పెంచినట్లయితే నిత్యవసర వస్తువుల చట్టం, బ్లాక్ మార్కెటింగ్ చట్టం, నిత్యవసర వస్తువుల నియంత్రణ చట్టం కింద చర్యలు చేపడతామన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలకు సంబంధించి ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ధరలు పెంచితే సమాచారం అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏదైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9281423653 కు తెలియజేయాలని ఆయన కోరారు. ఎల్ నినో లో జిల్లాలోని హోల్ సేల్ , రిటైల్ వ్యాపారులు ప్రజలకు సహకారం అందించాలని, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ నిత్యవసర సరుకులు అమ్మాల్సిన అవసరం ఉందని, ఇందుకు జిల్లా యంత్రాంగానికి అందరూ సహకరించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, పౌరసరఫరాల డిఎం రామ్ పతి నాయక్, మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, హార్టికల్చర్ అధికారి శేఖర్, నిత్యవసర సరుకుల అసోసియేషన్ల ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install AKSHARA KALAM App

Add to home screen for faster loading and latest updates.