ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలపండి..

బిఆర్ఎస్ నాయకులను కోరిన ఆటో యూనియన్ నాయకులు

మందమర్రి, ఆగస్టు 23 అక్షర కలం:

ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లకు బిఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆటో యూనియన్ జేఏసీ నాయకులు కోరారు. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఆదివారం రాత్రి నుండి ఆటోల బంద్‌ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పట్టణంలోని టిబిజికేఎస్ యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ, ఆటో ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను కలిసి, మద్దతు కోరారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం పట్టణ జేఏసీ నాయకులు మొయ్య రాంబాబు, నేరెళ్ల వెంకటేష్, మేడి రాజు, గోసిక ప్రభాకర్ తదితరులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారు సూరిబాబు, టిబిజికేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లకు బిఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్, బోరిగం వెంకటేష్, కనకం రవి, పల్లె నర్సింగ్ లు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment