మద్యం మత్తులో యువకుడి ఆత్మహత్య

మందమర్రి, ఆగస్టు 23 అక్షర కలం:

పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరల బంగ్లా ఏరియాలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఏరియాలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన ఆదివారం పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలోని దొరల బంగ్లా నివాసి గట్టు సాయికిరణ్ (25) ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇంట్లో నివసిస్తున్నాడు. ఆదివారం ఉదయం మద్యం మత్తులో ఉరివేసుకుంటానని బెదిరిస్తున్నట్లు మృతుని సోదరి గాయత్రి వారి తల్లి కుమారికి సమాచారం ఇవ్వగా, సమాచారం అందుకున్న తల్లి కుమారి కుటుంబ సభ్యులు, స్థానికులతో అక్కడికి చేరుకుని, ఇంటి తలుపులు ఎంత కొట్టినా తెరవకపోవడంతో కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా, సాయి కిరణ్ ఫ్యాన్‌ కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపులు పగలగొట్టి చూడగా, అప్పటికే అతను మృతి చెందాడని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ మేరకు మృతుడి తల్లి గట్టు కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Comments (0)
Add Comment