నార్లాపూర్ లో సీసీ రోడ్డును ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి

 

అక్షర కలం ప్రతినిధి, మందమర్రి జనవరి :19

మండలంలోని 6వ వార్డు నార్లాపూర్ గ్రామం స్టేజి నుండి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల వరకు కోటి రూపాయలతో సీసీ రోడ్డును సోమవారం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ, 6వ వార్డు నార్లపూర్ గ్రామ అభివృద్ధి లో భాగంగా వార్డుకు నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగినదని సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. పనులన్నీటిని ఒకటి తర్వాత ఒకటి పనులు చేస్తూ, నార్లాపూర్ అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, వికలాంగుల జాతీయ అధ్యక్షుడు పెద్దపల్లి సత్యనారాయణ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో గొల్లకుర్మా నాయకులు గొంగడి, గొర్రె పిల్ల, శాలువలతో సత్కరించారు.

గ్రామంలోని ఎస్సీ వాడ నుండి క్యాతనపల్లి వరకు రైతుల పొలాలకు కూలీలు వెళ్లడానికి దారి నిర్మించాలని, గతంలో 50 ఫీట్ల రోడ్డు ఉండేది కానీ ఇప్పుడు రోడ్డు లేకుండా అక్రమనకు గురైనదని రైతులు, కూలీలు, పొలాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని రోడ్డు నిర్మించి వాగు దగ్గర వంతెన నిర్మించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంట శ్రీశైలం, 6వ వార్డు నార్లపూర్ గ్రామ ఇన్చార్జి అంకం రాజ్ కుమార్, చేగొండ శంకరయ్య, గోపతి శ్రీనివాస్, కోరే చిన్న గట్టు ఎనుగుల బీరయ్య, బొలిశెట్టి వేణు, మేషనేని ప్రణయ్, కూన సత్యనారాయణ, మహిళా నాయకులు, వికలాంగుల జాతీయ నాయకులు పెద్దపెల్లి సత్యనారాయణ, గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

State Minister Vivek Venkataswamy inaugurated CC Road in Narlapur
Comments (0)
Add Comment