10 నిమిషాల్లోనే టీబీ పరీక్ష

— ఉచిత ‘ఏఐ’ స్క్రీనింగ్‌ను సద్వినియోగం చేసుకోండి

—టీబీ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

 ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం 

టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ దశ వందరోజుల కార్యక్రమం లో భాగంగా గురువారం జిల్లా క్షయ నివారణ కేంద్రం, నల్లగొండ గైనకాలజిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా రూపొందించిన టిబి అవగాహన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ అభియాన్, కార్యక్రమంలో జిల్లా గైనకాలజిస్ట్ డాక్టర్స్ స్వచ్ఛందంగా పాల్గొనడం, పోస్టల్ రూపొందించడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. డాక్టర్ పుట్ల శ్రీనివాస్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లాలోనీ ప్రతి గ్రామంలో, ఎంపిక చేసిన, స్లమ్స్, వల్నరబుల్, పని ప్రాంతాలలో ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఉచిత ఏఐ చెస్ట్ ఎక్స్ రే స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహించడం జరుకుతుందని తెలిపారు. ఈ క్యాంప్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా డయాబెటిక్, హైపర్ టెన్షన్, జ్వరం, దగ్గు, ఇతర వ్యాధులు కలిగిన ప్రతిఒక్కరు చెస్ట్ ఎక్స్ రే స్క్రీనింగ్ చేయించుకోవాలని ఆయన కోరారు. ఆధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ తో 10 నిమిషాలలో ఎక్స్ రే పరీక్ష పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ విశ్వ జ్యోతి, డాక్టర్ లీలావతి, డాక్టర్ సంస్కృతి, జిల్లా గైనకాలజిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

10 నిమిషాల్లోనే టీబీ పరీక్ష
Comments (0)
Add Comment