బహిరంగ సభకు ఇంటికో మహిళ కదలి రావాలి

 — ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి 

— జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ పిలుపు

అక్షరకలం నల్గొండ 

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల సందర్భంగా 25 వ తేదీన హైదరాబాద్ లోని బస్సు భవన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఇంటికో మహిళ తరలి రావాలని ఐద్వ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ పిలుపునిచ్చినారు. గురువారం నల్లగొండ పట్టణం పరిధిలోని పానగల్లులో ఐద్వా మహాసభల ప్రచారంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసిన అనంతరం పద్మ మాట్లాడుతూ మహిళల హక్కుల రక్షణ, సంక్షేమం, భద్రత, గౌరవం కోసం ఐద్వా నిరంతరం మిలిటెంట్ పోరాటాలను నడిపిందని అన్నారు. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, వేధింపులపై రాజీ లేకుండా పోరాడు తుందని తెలిపారు. ప్రభుత్వాలు మహిళలను రెండవ పౌరురాలిగా చూస్తున్న పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్త్రీ, పురుషులు సమానులే కానీ పాలక వర్గాలు మత భావాలను రెచ్చగొట్టి మహిళలను వంటింటికే పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా 33శాతం రిజర్వేషన్ పార్లమెంటు అండ్ అసెంబ్లీలలో అమలు చేయాలని, మహిళలకు పని ప్రదేశాలలో భద్రత కల్పించాలని, మహిళలు, బాలికలకు పౌష్టికాహారం, ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలని, లింగవివక్ష నిర్మూలనకు ప్రభుత్వాలు చట్టసభల్లో పురోగతి చూపాలి డిమాండ్ చేసినారు. వీటి సాధన కోసం మహాసభల్లో చర్చించి ఉద్యమాలు రూపొందించడానికి మహాసభ వేదిక కాబోతుందని తెలిపారు. మహిళల శక్తి ప్రభుత్వాలకు తెలియజేయడానికి 25వ తేదీన నిర్వహిస్తున్న బహిరంగ సభకు వేలాదిగా మహిళలు తరలివచ్చి ఐక్యతను ప్రదర్శించాలని నాగమణి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షురాలు ఆకటి లింగమ్మ, పట్టణ కమిటీ సభ్యురాలు బుజ్జమ్మ, జయమ్మ, లలిత, రేణుక, లక్ష్మి, లింగమ్మ, భవాని, అంజమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.

A woman should move from house to house for the public meeting
Comments (0)
Add Comment