– హాజరైన కలెక్టర్…. ఎమ్మెల్యే
నారాయణపేట జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 24, (అక్షర కలం వెబ్ ):
నారాయణపేట జిల్లా కేంద్రంలోని బారంబావి వద్ద బుధవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి హాజరై బతుకమ్మ విశిష్టత గురించి వివరించారు.
చిన్నారులు సాంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం బతకమ్మ పాటలకు మహిళలు కలెక్టర్ ఎమ్మెల్యే తో కలిసి ఆడి పాడి బతుకమ్మలను నిమజ్జనం చేశారు.