బీసీ ధర్మ పోరాట దీక్ష విజయవంతం…

బీసీ జేఏసీ…

నవంబర్ 13, అక్షరకలం వెబ్ : నల్లగొండ

నల్లగొండ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి పెంచడానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు అష్టాంగ ఆందోళనలు కార్యక్రమాలలో భాగంగా గురువారం నల్లగొండలో నాగార్జున కళాశాల వద్ద ఉదయం 10 గంటలకు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట ప్రారంభించబడింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నల్లగొండ బీసీ జేఏసీ చైర్మన్ రామరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని, అందుకొరకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దాన్ని ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికైన బిజెపి ఎంపీలు బాధ్యత తీసుకొని 42 శాతం రిజర్వేషన్ల అమలు కొరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వాటికి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత వారి పైన ఉన్నదని ఆ దిశగా వారి ప్రయత్నించాలని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీసీ జేఏసీ కోఆర్డినేటర్ నేలపట్ల సత్యనారాయణ, తండు సైదులు గౌడ్, సుంకరి మల్లేష్ గౌడ్, పిల్లి రామరాజు యాదవ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ కేశ బోయిన శంకర్ ముదిరాజ్,

బీసీ జేఏసీ కో చైర్మన్ లు. కాసోజు విశ్వనాథం, నకిరేకంటి కాశయ్య గౌడ్, చిక్కుళ్ళ రాములు, , జివాది ఇంద్రయ్య, పసుపులేటి సీతారాములు, గోకి కార్ శంకర్, వాడపల్లి సాయిబాబా,

బీసీ జేఏసీ ఆర్గనైజర్స్ వెంకటేశ్వర్లు, నల్ల సోమ మల్లన్న, సొల్లేటి రమేష్, నాగులపల్లి శ్యాంసుందర్, గంజి బిక్షమయ్య నేత, జెల్లా ఆదినారాయణ, కుడదల ఎల్లం రాజు, నల్ల మధు యాదవ్, చాగంటి రాములు, సింగారం మల్లయ్య ముదిరాజ్, బీసీ జేఏసీ గౌరవ సలహాదారులు కంది సూర్యనారాయణ,కొల్లోజు సత్యనారాయణ, గుంటోజు గోవర్ధన చారి తదితరులు పాల్గొన్నారు.

BC's dharma battle initiation successful...
Comments (0)
Add Comment