నల్లగొండ :ఆగస్టు, 25 (అక్షర కలం )
సోమవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక ట్యాక్స్ ను పంచాయతీ రాజ్ శాఖ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
మిర్యాలగూడ నియోజక వర్గ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు 1000 మెట్రిక్ టన్నుల ఇసుకను ఇచ్చేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ తీర్మానించింది. అలాగే మూసి పూర్తిస్థాయిలో ప్రవహిస్తున్నందున పరివాహక ప్రాంతంలో అందుబాటులో నదీ తీర ప్రాంతం నుండి ఇసుకను తతీసేందుకు కమిటీ తీర్మానించింది.
అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మైన్స్ శాఖ సహాయ సంచాలకులు జాకబ్, డిపిఓ వెంకయ్య, గృహనిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ ,గ్రౌండ్ వాటర్ డి డి రమాదేవి, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఇంజనీర్ శాంతకుమారి, టీజీఎండిసి పిఓ మధు, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.