పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు   స్థానిక సెలవు

— జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్

— ట్రెజరీలు, సబ్ ట్రెజరీలకు వర్తించదని స్పష్టం 

అక్షరకలం ప్రతినిధి, నల్గొండ 

గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల పరిధిలో స్థానిక సెలవుదినంగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల పరిధిలో ఈనెల 10,11 న, అలాగే రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల పరిధిలో ఈనెల 13,14 న, మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 16 ,17 తేదీలలో స్థానిక సెలవుదినంగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు వినియోగించుకునే ప్రభుత్వ సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్థానిక సెలవును ప్రకటించినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఈ సెలవు దినం ట్రెజరీలు, సబ్ ట్రెజరీలకు మాత్రం వర్తించవని ఆమె స్పష్టం చేశారు.

--- District Election OfficerDistrict Collector ---Clearly not applicable to treasuries and sub-treasuries
Comments (0)
Add Comment