తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు—

*తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి*

నల్లగొండ, అక్టోబర్ 01 (అక్షర కలం వెబ్):

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
దసరా పండుగ (విజయదశమి) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని ఆయన చెప్పారు . శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం , పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణకు ప్రత్యేకమని గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.ప్రజలందరు సుఖసంతోషాలతో దసరా పండుగ ఘనంగా జరుపుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు.

Happy Birthday to the people of Telangana state ---
Comments (0)
Add Comment