అక్షరకలం నాగార్జునసాగర్ : నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున ఏడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మైలపల్లి జానకి వెంకటేశ్వర్లు శుక్రవారం భారీ జనసందోహం నడుమ అత్యంత వైభవంగా నామినేషన్ పత్రాలను సమర్పించారు, నామినేషన్ ప్రక్రియకు చివరి రోజు కావడంతో వార్డు వీధులన్నీ హస్తం శ్రేణులతో,జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తాయి,ఈ నామినేషన్ లో పార్టీ సీనియర్ నాయకులు జంగన్న,మూడవ వార్డు అభ్యర్థి రాజా ప్రసాద్,11వ వార్డు అభ్యర్థి పగడాల నాగరాజు ఉంగరల శ్రీను,మైనార్టీ నాయకులు ముజీబ్ మత్స్యకారుల నాయకులు ర్యాలీలో పాల్గొని,కాంగ్రెస్ అభ్యర్థులందరి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పార్టీ కీలక నేతలు తమ అనుచర వర్గంతో తరలివచ్చి ర్యాలీకి భారీ ఊపును తీసుకొచ్చారు,స్థానిక మత్స్యకార నాయకులు ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వృత్తిరీత్యా సామాజికంగా తమకు అండగా ఉండే మైలపల్లి జానకి వెంకటేశ్వర్లును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు.
అభ్యర్థి వెంట మత్స్యకార సామాజిక వర్గం పెద్ద ఎత్తున కదలడం ప్రత్యర్థుల్లో చర్చనీయాంశంగా మారింది నామినేషన్ అనంతరం మైలపల్లి జానకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏడవ వార్డు ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటాను, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ఇంటింటికీ తీసుకెళ్లి,ఈ వార్డును అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలబెడతాను.ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు,మత్స్యకార సోదరులకు నా కృతజ్ఞతలు.అని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో స్థానికులు మత్స్యకారుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.