కొల్చారం, నవంబర్ 05( అక్షర కలం వెబ్ ):-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బుధవారం మైనార్టీ సోదరులతో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షేట్కర్, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మొహి నుద్దీన్ కలిసి బుధవారం ఉదయం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ సెట్కర్ మాజీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మొహియుద్దిన్ లు మాట్లాడుతూ పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదని , తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బి ఆర్ఎస్ పార్టీ దక్కిందని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్ గ్యారంటీ పథకాలలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేయాలని ఉద్దేశంలో ఉందని వారు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లో ఇస్తానని చెప్పి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు , నాయకులకు మాత్రమే ఇచ్చిందని వారు తెలిపారు . కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , ఇందిరమ్మ ఇండ్ల పథకం , గృహ వెలుగు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలను చూసి బిఆర్ఎస్, బిజెపి పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని వారు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కు చేతి గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లకు తెలిపారు.