ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు

జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్

​—నాణ్యత ప్రమాణాల మేరకు వెంటనే ధాన్యం సేకరణ చేపట్టాలి కలెక్టర్ ఆదేశం 

 —జి. చెన్నారం, ఎస్.ఎల్.బి.సి మార్కెట్ యార్డుల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఉమ్మడి నల్లగొండ బ్యూరో అక్షరకలం 

సరైన నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.

ఆదివారం అయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న జి. చెన్నారం ,ఎస్ .ఎల్. బి. సి మార్కెట్ యార్డ్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అదే విధంగా లల్లాయిగూడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన దాన్యం నాణ్యత ప్రమాణాలను, తాలు, తరుగు, తేమ, తూకం, తూకం వేస్తే యంత్రాలు, రిజిస్టర్లు ,అక్కడ ఏర్పాటు చేసిన నీడ, తాగునీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.

ఆయా కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులతో పాటు, రైతులతో కలెక్టర్ మాట్లాడారు. తాలు, తరుగు వంటివి లేకుండా సరైన నాణ్యత ప్రమాణాలతో ధాన్యం వస్తే తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు. నాణ్యత ఉన్నవి, లేనివి రెండు కలిపి మిల్లులకు పంపించవద్దని, వేరువేరుగా పంపించాలని సూచించారు. అలాగే ధాన్యం సేకరణలో మిల్లులకు పంపించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవాలని సెంటర్ ఇన్చార్జిలను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

No delay in grain purchases
Comments (0)
Add Comment