*అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా డా.చిలుముల బాల్ రెడ్డి, బొమ్మపాల గిరిబాబు ఏకగ్రీవ ఎన్నిక*
నల్లగొండ,సెప్టెంబర్, 4 అక్షర కలం ప్రతినిధి :
నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో గల వైఆర్పి ఫౌండేషన్ కార్యాలయంలో ఈరోజు
పిఆర్టియు తెలంగాణ నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగులవంచ చంద్రశేఖర రావు, ఎన్నికల పరిశీలకులుగా సూర్యాపేట జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్, ఉపేందర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
పి ఆర్ టి యు నల్గొండ జిల్లా అధ్యక్షులుగా చిలుముల బాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా బొమ్మపాల గిరిబాబు లను ప్రకటిస్తూ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తూ ముందుంటామని అభిప్రాయపడ్డారు.
ముఖ్యఅతిథి చంద్రశేఖర రావు మాట్లాడుతూ నూతన కార్యవర్గం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు.
అధ్యక్షుడు చిలుముల బాల్రెడ్డి మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో సంఘం ప్రతి జిల్లాలో బలపడుతూ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.
నూతనంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రతి మండలంలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తూ ఎక్కువమంది ఉపాధ్యాయులను సంఘ కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా కార్యాచరణను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అనంతరం నల్గొండ జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గంలోకి రాష్ట్ర సహా అధ్యక్షునిగా ఎన్నికైన కొణిదెల శంకర్ ను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో
ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ దగ్గుపాటి విమల, పిడిపీటిల అసోసియేషన్ అధ్యక్షులు ఇమామ్ కరీం, ప్రధాన కార్యదర్శి నారాయణ కవిత మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.