–– జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్
ఉమ్మడి నల్లగొండ బ్యూరో అక్షరకలం
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ మరియు పునరావాస పనులను త్వరితగతన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూసేకరణ పునరావాసం పై నిర్వహించిన సమావేశంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వల్ల భూములు కోల్పోయిన బాధితులకు ఇంకా ఇవ్వవలసిన నష్టపరిహారం, పునరావాస ప్రయోజనాలు ఆలస్యం లేకుండా వెంటనే అందించాలన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిహారం చెల్లింపులు కూడా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.
భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, ఆర్&ఆర్ కాలనీలో మౌలిక వసతులు రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ పూర్తి స్థాయిలో కల్పించాలని చెప్పారు. ప్రాజెక్ట్ పనులు వేగవంతం కావాలంటే భూ సేకరణ, పునరావాస ప్రక్రియ సమర్థవంతంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన అన్ని బెనిఫిట్స్ సమయానికి అందేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఈఈ. జయరాం రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.