— ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
—మేయర్ నివాసంలో తొలి నమోదు.. పౌరులంతా భాగస్వాములు కావాలని సూచన
ఉమ్మడి నల్లగొండ బ్యూరో అక్షరకలం
దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న జనగణన –2027 కార్యక్రమంలో భాగంగా, నల్గొండ నగరంలో స్వీయ నమోదు ప్రక్రియ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధుల నివాసాల నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మేయర్ నివాసంలో తొలి నమోదు చేసారు.
నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నివాసాన్ని మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణవేణి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్‌లు సందర్శించారు. మేయర్ స్వయంగా తన కుటుంబ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వ పథకాలు, భవిష్యత్తు లబ్ధులు ఈ డేటాపైనే ఆధారపడి ఉంటాయి. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉండే ఈ అవకాశాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని సూచించారు.
మేయర్ నివాసం అనంతరం అధికారులు డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మహమ్మద్ నివాసాన్ని సందర్శించి నమోదు ప్రక్రియను పూర్తి చేయించారు.
47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవిత,
40వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డుపల్లి లక్ష్మి తమ నివాసాల్లో స్వీయ నమోదును పూర్తి చేసుకున్నారు.
ఈ ప్రక్రియ అత్యంత సులభంగా, వేగంగా ఉందని, ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా
మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలోని అన్ని వార్డు అధికారులు తమ పరిధిలోని ప్రజాప్రతినిధుల ఇళ్లను సందర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.
ఏవైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్. ప్రదీప్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ శివరాం రెడ్డి, ఇతర వార్డు అధికారులు పాల్గొన్నారు.
––రిఫరెన్స్ నంబర్‌ను చూపాలి…
గడువు తేదీలు ఈనెల 26 నుండి మే 10 వరకు
ఆన్‌లైన్ ద్వారా కేవలం 5 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. తదుపరి చర్య నమోదు తర్వాత వచ్చే రిఫరెన్స్ నంబర్‌ను భద్రపరుచుకోవాలి.
ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు సదరు రిఫరెన్స్ నంబర్‌ను చూపాలి