* గత ప్రభుత్వ హయాంలో కంటే రెట్టింపు సీఎంఆర్ఎఫ్ చెక్కులు…
* అధికారంలో లేకున్నా ప్రజాసేవనే నా లక్ష్యం..
– నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి….
కొల్చారం, సెప్టెంబర్ 23 ( అక్షర కలం వెబ్ ):-
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం… సీఎం రేవంత్ రెడ్డి పేదల విద్య, వైద్యానికి పెద్దపీట వేసి ప్రజా పాలన అందిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంతో పాటు రంగంపేటలో గ్రామాలలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులకు సుమారు మూడు లక్షల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన సొంత నిధులతో మాతృదేవోభతకం కింద గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలవకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానన్నారు. ఎన్నికల హామీలో ఊరు ఊరు తిరిగి ప్రజల సమస్యలు, కష్టాలు తెలుసుకున్నానని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకం, ఎల్ వో సి లు ఇప్పించడంలో పారదర్శకంగా, సులభతరంగా వ్యవహరిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో సులభతరంగా ఆరోగ్య సేవలు అందుతున్నాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సావిత్రి రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, గజిని వెంకట్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ మన్నె శీను, బండి సుజాత రమేష్, శేఖర్, గోవర్ధన్, విట్టల్ గౌడ్ అక్రమ్, శ్రీశైలం, గజినీ వెంకట్ గౌడ్, పోతిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి, లంబాడి రూపుల, బండి మల్లేశా, పైతర భూమయ్య, కొమ్ముల రవీందర్ గౌడ్, వైద్య సిబ్బంది మజీదా బేగం, ఆశ వర్కర్లు కవిత, రాణి తదితరులు పాల్గొన్నారు.