–— అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి
—కలెక్టరేట్‌లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు
అక్షరకలం నల్గొండ
జిల్లా అభివృద్ధిలో వాసవి మాత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి అన్నారు. వాసవి మాత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన వాసవీ మాత జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని వాసవి మాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాసవి మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు, యువజన అభివృద్ధి శాఖ అధికారి మహమ్మద్ అక్బర్ ఆలీ, కలెక్టర్ కార్యాలయ సూపరింటిండెంట్లు , తదితరులు పాల్గొన్నారు.