బందోబస్త్ నిర్వహిస్తున్న ఎస్సై టి. వి. ఆర్. సూరి                 ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

 మంగపేట, జనవరి 1 ( అక్షర కలం వెబ్ ):

గత యేడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 2026 నూతన సంవత్సరానికి ప్రజలు గురువారం స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం నుంచే విందులు, సంబరాలు ప్రారంభమయ్యాయి. మద్యం, మాంసం, కేక్‌లు, కూల్‌ కేక్‌లు, కూల్‌డ్రింక్‌లు, రకరకాల రంగులు విక్రయాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా యువత మస్త్‌గా ఎంజాయ్‌ చేశారు.

నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ బుధవారం రాత్రి 12 గంటలకు సంబరాలు అంబరాన్నంటాయి. న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి పోలీస్‌ శాఖ కఠిన నిబంధనలు విధించింది. మద్యం మత్తులో వాహనాలు జరిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పై విధంగా నిర్ణయం తీసుకుంది. , న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా

మండలంలో ఎలాంటి అల్లర్లు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా మంగపేట ఎస్సై టి.వి.ఆర్. సూరి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలోని ముఖ్య కూడళ్లు పోలీసుల పహారీలో ఉండడం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంతో నూతన సంవత్సర వేడుకలు మండలంలో ప్రశాంతంగా జరిగాయి.

Bandobast is conducted by SSI T. V. R. Suri had a great New Year celebration
Comments (0)
Add Comment