ఆందోల్ నియోజకవర్గంలో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులను సత్కరించిన ఆరోగ్య మంత్రి దామోదర

హైదరాబాద్: డిసెంబర్ 18,( అక్షర కలం న్యూస్):

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా గారు అందోల్ నియోజక వర్గం లోని రేగోడ్ మండలం సింధోల్ గ్రామ సర్పంచ్ గా విజయం సాధించిన ఎరుపుగొండ రవి , ఉప సర్పంచ్ మణెమ్మ యాదయ్య , వార్డు సభ్యులు పాండురావు , గొల్ల యాదయ్య , గోపాల్ , సుందరయ్య లను హైదరాబాద్ లోని తన నివాసం లో అభినందించారు. సింధోల్ గ్రామాభివృద్ది కీ కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు . నూతనంగా ఎన్నికైన సర్పంచ్ , ఉప సర్పంచ్ , వార్డ్ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమం లో మాజీ జెడ్ పి టి సీ యాదగిరి , గోపన పల్లి రాచప్ప , మాణెప్ప , యువ నాయకులు రాజు పటేల్ , ఎ.కే ఆనంద్ , గ్రామ పార్టీ అధ్యక్షులు మల్ రెడ్డి , సుభాష్ , పాపిరెడ్డి , భాను ప్రకాష్ , గ్రామ పార్టీ ముఖ్య నాయకులు పాల్గోన్నారు .

Health Minister Damodara felicitated Sarpanch and ward members who won in Andol constituency
Comments (0)
Add Comment